ఈనెల 8 నుంచి ఉచిత కోచింగ్
AKP: ఎస్ రాయవరం మండల పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఈనెల 8వ తేదీ నుంచి అడ్డరోడ్డు జంక్షన్ ఆదర్శ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉచిత పాలిటెక్నిక్ కోచింగ్ క్లాసులు నిర్వహిస్తున్నారు. సోమవారం గోడపత్రికను డీఈవో అప్పారావు నాయుడు ఆవిష్కరించారు. పీఆర్టీయూ మండల అధ్యక్షుడు కుమార్ మాట్లాడుతూ.. పదవ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.