చెర్వుగట్టు హుండీ ఆదాయం రూ.18 లక్షలు

చెర్వుగట్టు హుండీ ఆదాయం రూ.18 లక్షలు

NLG: నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలోని హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. చెర్వుగట్టు గుట్టపైన దేవస్థానంలో అమ్మవారి హుండీ ఆదాయం రూ.3,92,160, స్వామివారి హుండీ ఆదాయం రూ.14,71,520లు మొత్తం ఆదాయం 16 రోజులకు గాను రూ.18 లక్షల 63 వేల 680 వచ్చాయని ఈవో ఎస్.నవీన్ తెలిపారు.