'తుఫాను వల్ల నష్టపోయిన కార్మికులను ఆదుకోవాలి'

'తుఫాను వల్ల నష్టపోయిన కార్మికులను ఆదుకోవాలి'

KDP: మొంథా తుఫాను కారణంగా పనులు లేక నష్టపోయిన చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు శివనారాయణ తెలిపారు. బుధవారం జమ్మలమడుగులో ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఎక్కువ శాతం మంది మగ్గాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, తుఫాను కారణంగా వారు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.