‘వంద దేవుళ్ళు’ టీజర్ రిలీజ్
'బిచ్చగాడు' వంటి భారీ హిట్ తర్వాత విజయ్ ఆంటోనీ, డైరెక్టర్ శశి కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘వంద దేవుళ్ళు’. ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. యథార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోందని మూవీ యూనిట్ తెలిపింది. స్వాసిక, అజయ్, కావ్య ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు.