VIDEO: పసుమర్రు వద్ద రోడ్డు ప్రమాదం వ్యక్తికి తీవ్ర గాయాలు
PLD: చిలకలూరిపేట(మం) పరిధిలోని పసుమర్తి నూతన హైవేపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జాన్ రాజ్ (26) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. మార్టూరు నుండి అన్నంబొట్లవారి పాలెం వెళుతున్న బొలెరో వాహనం, ఆర్టీసీ బస్సు పసుమర్తి మలుపు వద్ద ఢీకొన్నాయి. స్థానికులు సమాచారం అందించడంతో 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడికి చికిత్స చేసి ఆసుపత్రికి తరలించారు.