సంతానం కలగడంలేదని మనస్తాపంతో మహిళ అదృశ్యం

సంతానం కలగడంలేదని మనస్తాపంతో మహిళ అదృశ్యం

RR: సంతానం కలగడం లేదని మనస్తావంతో ఓ మహిళ అదృశ్యమైన సంఘటన అత్తాపూర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. అత్తాపూర్ భరత్‌నగర్‌లో నివాసం ఉండే మనోజ్‌కు మూడేళ్ల క్రితం ఐశ్వర్య(22)తో వివాహం జరిగింది. పిల్లలు లేరని బాధపడుతున్న ఐశ్వర్య 'కాశీకి వెళ్తున్నాను' అని ఓ ఉత్తరం రాసి వెళ్లిపోయింది. భర్త మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.