సింహాచలంలో పునర్వసు హోమం

VSP: విశాఖలోని సింహాచలం ఆలయంలో పునర్వసు హోమం బుధవారం వైభవంగా జరిగింది. శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారి ఉప ఆలయమైన రామాలయంలో శ్రీరాముని జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వీ.త్రినాథరావు ఆదేశాల మేరకు.. ఆలయ స్థానాచార్యులు, అర్చకులు, వేద పండితులు ఈ హోమాన్ని నిర్వహించారు.