9న టీడీపీ విస్తృతస్థాయి సమావేశం

E.G: తేటగుంట టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యనమల దివ్య అధ్యక్షతన టీడీపీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, తుని పార్టీ పరిశీలకులుగా అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు బుద్దా నాగ జగదీశ్వరరావు హాజరుకానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.