రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

VSP: మారికవలస జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కృష్ణాపురం సంజయ్ గాంధీ కాలనీకి చెందిన పాడి సురేంద్రరావుగా స్థానికులు గుర్తించారు. పీఎంపాలెం పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.