కళ్లలో కారం కొట్టి.. కోటి స్వాహా.!
HYD: కూకట్‌పల్లిలో భారీ దారి దోపిడీ జరిగింది. బహదూర్ పురాకు చెందిన కుస్రు, అజీముద్దీన్ అర్ధరాత్రి డబ్బుతో వెళ్తుండగా నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌లపై వచ్చి కళ్లలో కారం చల్లారు. అనంతరం రూ. కోటి నగదు తీసుకుని పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలిస్తున్నారు. హవాలా డబ్బు కావొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.