గొడుగుపేట వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి భారీ ఆదాయం

గొడుగుపేట వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి భారీ ఆదాయం

కృష్ణా: విజయవాడ గొల్లపూడిలో ఉన్న 40 ఎకరాల భూమి ద్వారా మచిలీపట్నంలోని గొడుగుపేట వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించేందుకు గాను సదరు దేవస్థానం భూములను విజయవాడ ఉత్సవ కమిటీ 56 రోజుల లీజుకు తీసుకుంది. అయితే రూ.45 లక్షల లీజు చెక్కును ఆదివారం దేవస్థానం పాలకవర్గానికి మంత్రి కొల్లు రవీంద్ర అందజేశారు.