జరజాపుపేటలో కోటి సంతకాల సేకరణ

జరజాపుపేటలో కోటి సంతకాల సేకరణ

VZM: నెల్లిమర్ల నియోజకవర్గం జరజాపుపేటలో కోటి సంతకాల సేకరణను నగర పంచాయతీ వైస్ ఛైర్మన్ సముద్రపు రామారావు ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సంతకాల సేకరణ అనంతరం గవర్నర్‌కు అందజేయడం జరుగుతుందని తెలిపారు.