'విద్యార్థులు దేశభక్తిని పెంపొందించుకోవాలి'
VKB: విద్యార్థులు దేశభక్తిని పెంపొందించుకోవాలని చైల్డ్ లైన్ కో-ఆర్డినేటర్ శివరాజ్ పేర్కొన్నారు. శుక్రవారం నవాబ్ పేట్ మండలం నారగూడెం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సామూహిక వందేమాతరం గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంకించంద్ర చటర్జీ రచించిన వందేమాతరం గేయం 150 సంవత్సరాలు పూర్తి చేస్తుందని అన్నారు.