జిల్లాలో 43.5°C ఉష్ణోగ్రత

KRNL: జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యప్రతాపానికి ప్రజలు విలవిల్లాడుతున్నారు. మంగళవారం కర్నూలులో 43.5°C ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 9 గంటలకే వాతావరణం వేడెక్కుతుండటంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. మరోవైపు భగ్గుమంటున్న ఎండళ వేళ శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.