గూడూరు సర్పంచ్‌కి గజమాలతో స్వాగతం
RR: కొత్తూరు మండలం గూడూరు గ్రామ సర్పంచ్‌గా గెలిచిన దయానంద్ గుప్తాను మాజీ సర్పంచ్ సత్తయ్య గజమాలతో ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు. సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధిలో ప్రజలు సైతం భాగస్వాములు కావాలని, ఐక్యమత్యంతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని తెలిపారు. గ్రామ ప్రజల ఆశీస్సులు తమకు ప్రేరణగా పనిచేస్తాయని పేర్కొన్నారు.