VIDEO: గుడిపల్లి ఎక్కడికి పోదు: మంత్రి
సత్యసాయి: సోమందేపల్లి మం. గుడిపల్లిలో రిజర్వాయర్ వద్దని, మా గ్రామం మాకు కావాలని మంత్రి సవితకు గుడిపల్లి గ్రామస్థులు విన్నవించారు. ఇవాళ గుడిపల్లిలో మంత్రి మాట్లాడుతూ.. రిజర్వాయర్ నిర్మాణం కోసం అనువైన ప్రదేశం కోసం చూస్తున్నామని తెలిపారు. గుడిపల్లిలో రిజర్వాయర్ నిర్మించాల్సి వస్తే గ్రామస్థులతో గ్రామసభ నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.