మధురైలో విజయ్ భారీ బహిరంగ సభ

TVK పార్టీ అధినేత, ప్రముఖ నటుడు విజయ్ ఈరోజు మధురైలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభలో విజయ్ పొత్తుల గురించి కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సభ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. సభను విజయవంతం చేయడానికి భారీ సంఖ్యలో అభిమానులు తరలివస్తున్నారు.