VIDEO: 'కౌలు రైతులకు పంటల బీమా పరిహారం చెల్లించాలి'

VIDEO: 'కౌలు రైతులకు పంటల బీమా పరిహారం చెల్లించాలి'

ELR: మొంథా తుఫాన్ వలన నష్టపోయిన కౌలు రైతులకు పంటల బీమా పరిహారం చెల్లించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు, జిల్లా కార్యదర్శి కే. శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం దెందులూరు మండలంలోని సత్యనారాయణపురం, ఉండ్రాజవరం గ్రామాలలో పర్యటించి తుఫాను ప్రభావిత పంటలను పరిశీలించారు. నేల వాలిన వరి పంటను పరిశీలించి నష్టం వివరాలను తెలుసుకున్నారు.