బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచిన MLA
ASF: వాంకిడి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మెగా ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్‌ను MLA కోవ లక్ష్మి సోమవారం ప్రారంభించారు. MLA మాట్లాడుతూ.. క్రీడలు యువతలో క్రమశిక్షణ, క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తాయని, గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. అనంతరం బ్యాట్ పట్టి బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.