పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ
SRD: సదాశివపేట మండలం పెద్దాపూర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రాన్ని ఎస్పి పరితోష్ పంకజ్ ఇవాళ పరిశీలించారు. ఈ తరుణంలోనే పోలింగ్ కేంద్రంలో చేస్తున్న ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. మొదటి విడత ఎన్నికలు జరిగే ఏడు మండలాల్లోని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాలు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.