మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం

మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం

MDK: మట్టి వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని పరిరక్షిద్దామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో కాలుష్య నియంత్రణ మండలి కేంద్ర కార్యాలయంలో రూపొందించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరు మట్టి గణపతులను ప్రతిష్టించి పూజించాలని సూచించారు.