146 మద్యం బాటిళ్లు స్వాధీనం
SKLM: వజ్రపుకొత్తూరు మండలంలోని బెండి గేట్ కూడలిలో అక్రమంగా నిల్వ ఉంచిన 146 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఎస్‌ఐ బి.నీహర్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు పలు దుకాణాలలో చేపట్టారు. ఈ మేరకు చల్లా వినోద్ దుకాణంలో 146 మద్యం సీసాలు అక్రమంగా నిల్వ ఉంచినట్లు గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకుని అతని పై కేసు నమోదు చేసినట్లు SI తెలిపారు.