బావిలో దూకి వ్యక్తి ఆత్మహత్య..

BDK: ఓ వ్యక్తి బావిలో దూకి మృతి చెందిన ఘటన చర్ల గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వ్యక్తి, రోజు కూలి పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. కొంతకాలంగా భార్యతో దూరంగా ఉంటున్నాడు. మద్యానికి బానిసై భార్యకు దూరంగా ఉండటంతో మనస్థాపంకు గురై బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.