భూ భారతి స్కామ్‌పై కఠిన చర్యలు: పొంగులేటి
యాదాద్రి భువనగిరి జిల్లాలో భూ భారతిలో అక్రమాలు జరిగిన మాట వాస్తవమేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అంగీకరించారు. ఈ కుంభకోణంపై ఇప్పటికే కమిటీ వేశామని, ముగ్గురు నలుగురు మీసేవ నిర్వాహకులను అరెస్ట్ చేశామని తెలిపారు. అవినీతికి పాల్పడిన వారు ఎంతటి అధికారులైనా వదిలేది లేదని, వారిని అరెస్ట్ చేసే వరకు వదిలిపెట్టమన్నారు.