రహదారిపై వాహన రాకపోకలు పునరుద్ధరణ

కృష్ణా: ఉంగుటూరు -లంకపల్లి మధ్య కాజ్వే వంతెనపై గురువారం ఉదృతంగా ప్రవహించిన బుడమేర తగ్గుముఖం పట్టింది. దీంతో తేలప్రోలు-ఉయ్యూరు ప్రధాన రహదారిపై వాహన రాకపోకలు పునరుద్ధరించారు. అయితే వన్నేరువాగు వరద ఉధృతి కొనసాగుతుండటంతో పరివాహక గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు. సుమారు 300 ఎకరాల్లో వరి పొలాలు ఇంకా నీటి మునిగిపోయి చెరువుల్లా కనిపిస్తున్నాయి.