కడప డీఎస్పీపై బదిలీ వేటు
AP: కడప డీఎస్పీ వెంకటేశ్వర్లుపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణలో విఫలమయ్యారనే కారణంతో తక్షణమే డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. నిన్న రాత్రి కడప రిమ్స్ సమీపంలో గంజాయి బ్యాచ్ ఓ వ్యక్తిని కత్తులతో పొడిచి చంపడం కలకలం రేపింది. అలాగే, డీఎస్పీపై అవినీతి ఆరోపణలు కూడా రావడంతో ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.