'టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి'

'టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి'

MDK: 2010 కంటే ముందు నియమితులైన ఉపాధ్యాయులందరికీ టెట్ నుంచి మినహాయింపు ఇచ్చే విధంగా కృషి చేయాలని తపస్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జిడ్డి ఎల్లం, చల్ల లక్ష్మణ్ కోరారు. చేగుంటలో మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు వినతి పత్రం అందజేశారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి, లోక్ సభలో ప్రస్తావించాలని కోరారు. కార్యక్రమంలో సంఘ బాధ్యులు పాల్గొన్నారు.