వైభవంగా స్వామివారి రథోత్సవం
JGL: కార్తీక మాసంలో నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవాన్ని కోరుట్ల మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో గురువారం సాయంత్రం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పుణ్యాహవచనం,మృత్యుంగ్రహణం, అంకురారోహణం, అఖండ దీపారాధన, దేవత స్థాపనలను ఆలయ అర్చకులు వేదోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీవారికి విశేష అలంకరణ చేపట్టి, రథంపై అందంగా అలంకరించారు.