కేంద్ర మంత్రిచే అవార్డు అందుకున్న సీడీపీవో

SKLM: సారవకోట సమగ్ర శిశు అభివృద్ధి సంక్షేమ శాఖ అధికారిని సీహెచ్ వంశీ ప్రియ 79వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఢిల్లీలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర మహిళా సంక్షేమ శాఖ మంత్రి చేతుల మీదగా అవార్డు అందుకున్నారు. రాష్ట్రం తరఫున ఒకే ఒక సీడీపీవోని ఎంపిక చేయడం గర్వకారణం అని ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు అధికారులు అంటున్నారు.