VIDEO: 'మాగేచెరువులో ఉపాధ్యాయులను నియమించండి'
సత్యసాయి: సోమందేపల్లి మండలం మాగేచెరువు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించాలని గ్రామస్థులు ఎంఈవో ఆంజనేయులు నాయక్‌ను కోరారు. గ్రామస్థులు మాట్లాడుతూ.. 15 రోజుల నుంచి పాఠశాలలో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గతంలో పనిచేసే ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లారు. నూతన ఉపాధ్యాయులను వెంటనే నియమించాలన్నారు.