రీల్స్ పిచ్చి.. ప్రాణం మీదకు తెచ్చుకున్నారు!
సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం యువత ప్రాణాలకు తెగిస్తున్నారు. రీల్స్ మోజులో పడి ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తున్నారు. తాజాగా హర్యానాలో కొందరు యువకులు థార్ కారుపై నిలబడి రీల్స్ చేశారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న ఓ లారీని తప్పించబోయి డ్రైవర్ బ్రేక్ వేశాడు. దీంతో కారుపై ఉన్న యువకులు కింద పడ్డారు. అయితే, ట్రక్ డ్రైవర్ కూడా సకాలంలో బ్రేక్ వేయడంతో ప్రాణాలతో బయటపడ్డారు.