ఇసుక ట్రాక్టర్ పట్టివేత

SRPT: కోదాడ మండలం దోరకుంట గ్రామ శివారులో అక్రమంగా ట్రాక్టర్‌లో తరలిస్తున్న ఇసుకను మంగళవారం సాయంత్రం పట్టుకున్నట్లు ఎస్సై గోపాల్ రెడ్డి తెలిపారు. మంగలి తండాకు చెందిన నెహ్రూ పాలేరు వాగు నుంచి ఇసుకను అక్రమంగా కోదాడకు తరలిస్తున్నాడు. దోరకుంట గ్రామ శివారులో వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు ట్రాక్టర్‌ను తనిఖీ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.