యజమానిని చంపి పనిమనిషి పరార్

యజమానిని చంపి పనిమనిషి పరార్

NTR: విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. గుణదల ఎన్టీఆర్ కాలనీ సమీపంలో పనిమనిషి ఇంటి యజమానిని హత్య చేసి, ఇంట్లో ఉన్న బంగారం తీసుకొని పారిపోయింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉంటే రామారావు మూడు రోజుల క్రితం అనూష అనే పనిమనిషి పెట్టుకున్నారు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి రామారావును హత్య చేసి బంగారం తీసుకుని పారిపోయిందని తెలిపారు.