KGBV ప్రవేశాల దరఖాస్తుల గడువు పొడిగింపు
కర్నూలు: కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో (KGBV) ప్రవేశాలకు దరఖాస్తు గడువు ఏప్రిల్ 20 వరకు పొడిగించారు. రాష్ట్రవ్యాప్తంగా 352 KGBVల్లో 6,11 తరగతుల్లో ప్రవేశాలు, 7,10, 12 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అన్ని KGBVల్లో కలిపి 32,079 సీట్లు ఉండగా.. ఇప్పటివరకు 69,362 దరఖాస్తులు వచ్చాయి.