ఇద్దరికి 7 రోజుల జైలు శిక్ష

ఇద్దరికి 7 రోజుల జైలు శిక్ష

NZB: డిప్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనం నడిపిన ఇద్దరు వ్యక్తులకు 7 రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై ఎండీ షరీఫ్ తెలిపారు. ఈనెల 5, 12 తేదీల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించామన్నారు. మద్యం తాగి వాహనం నడిపిన వారికి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ బేగం ఎదుట హాజరు పరిచినట్లు తెలిపారు. అనంతరం వారిని జైలుకు తరలించినట్లు వెల్లడించారు.