'ఐ-బొమ్మ' నిర్వాహకుడి తండ్రి సంచలన వ్యాఖ్యలు

'ఐ-బొమ్మ' నిర్వాహకుడి తండ్రి సంచలన వ్యాఖ్యలు

'ఐ-బొమ్మ' పైరసీ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కూకట్‌పల్లిలో అరెస్టు చేశారు. రవి అరెస్ట్‌పై స్పందిస్తూ ఆయన తండ్రి అప్పారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'రవి కేసుల గురించి నాకు తెలియదు. సమాజానికి చెడు చేసిన వారికి శిక్ష తప్పదు' అని పేర్కొన్నారు. అలాగే, రవితో మాట్లాడి దాదాపు రెండు నెలల పైనే అవుతుందని తెలిపారు.