VIDEO: గంటకు 140KM వేగంతో ట్రయల్ రన్

VIDEO: గంటకు 140KM వేగంతో ట్రయల్ రన్

NTR: గూడూరు నుంచి విజయవాడ మధ్యలో నూతనంగా నిర్మిస్తున్న 3వ లైన్ రైల్వే పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 293KM లైన్లో 251KM పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో పూర్తయిన ప్రాంతంలో 140KM వేగంతో రైలు ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రస్తుతం చుండూరు-తెనాలి-విజయవాడ మధ్య 42KM పనులు జరుగుతున్నాయి.