నష్టపోయిన వరి రైతులును ఆదుకుంటాం: జే.సీ

ELR: అకాల వర్షాలకు నష్టపోయిన వరి రైతులు వివరాలను ప్రభుత్వానికి నివేదించి ఆదుకుంటామని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. గణపవరం మండలంలోని జల్లికొమ్మరలో సోమవారం ఆయన పర్యటించారు. నీట మునిగిన పొలాలను పరిశీలించారు. ఇప్పటికే ఎకరానికి రూ. 20 వేలు పెట్టుబడి పెట్టామని, వానలకు తీవ్ర నష్టపోయామని రైతులు వాపోయారు.