ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు
GDWL : హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో నిన్న 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో గద్వాల్ జిల్లాకు చెందిన వారు ఇద్దరు ఉన్నారు. గద్వాల్ పట్టణానికి చెందిన రజిని, మల్దకల్ మండలం కుర్తిరావుల చెరువు గ్రామానికి చెందిన భాస్కర్ ఉన్నారు. వీరు సీఎం రేవంత్ రెడ్డి, పోలీస్ ఉన్నతాధికారుల సమక్షంలో ఆయుధాలు సమర్పించి లొంగిపోయారు.