VIDEO: మత్తడివాగుకు గండి.. రైతుల ఆందోళన

VIDEO: మత్తడివాగుకు గండి.. రైతుల ఆందోళన

MNCL: భారీ వర్షం కురుస్తున్న కారణంగా కవ్వాల్ మత్తడి వాగుకు గండి పడడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మత్తడి వాగు కట్టను మరమ్మతులు చేయిస్తే ఆ నీరు రాములవారి చెరువులోకి వచ్చి చెరువు కింద ఉన్న వందల ఎకరాలు పంట పొలాలు సమృద్ధిగా పండుతాయన్నారు. సాగునీరు లేక రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. మరమ్మతులు చేయించాలని అధికారులను వేడుకుంటున్నారు.