రేపు నగరంలో సందడి చేయనున్న ప్రముఖ సినీ తార
WGL: ప్రముఖ సినీ తార శ్రీలీల రేపు నగరానికి రానున్నారు. ఈ మేరకు శ్రీలీల ఓ వీడియోను విడుదల చేశారు. నగరంలోని రైల్వే స్టేషన్‌కు వెళ్లే దారిలో నూతనంగా నిర్మించిన ఓ ప్రైవేట్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు తాను వరంగల్ వస్తున్నట్లు తెలిపారు. ఇక్కడికి వచ్చి నగర ప్రజలను కలుస్తానని సోషల్ మీడియాలో చెప్పారు.