రామాయంపేటలో ఉచిత మెగా వైద్య శిబిరం
MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో శనివారం భగత్ సింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. స్థానిక గాంధీ చౌక్ వద్ద ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరంలో హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్య బృందం ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శంకర్ గౌడ్ పాల్గొన్నారు.