ప్రతిరోజు మంత్రులు బజార్‌లో కొట్లాడుతారు: కేటీఆర్
TG: HYDపై గులాబీ జెండా ఎగరాలని మాజీ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. కాంగ్రెస్ వాళ్లతో ఏమీ కాదని.. ప్రతిరోజు ఇద్దరు మంత్రులు బజార్‌లో కొట్లాడుతారని విమర్శించారు. రాష్ట్రం దివాళా తీసిందని చెబితే ఎవరైనా వస్తారా? అని నిలదీశారు. 11 ఎకరాలను కాపాడుకోవడానికే అరికపూడి గాంధీ పార్టీ మారారని ఆరోపించారు. సిగ్గు లేకుండా అభివృద్ధి కోసం అంటున్నారని మండిపడ్డారు.