ఇద్దరి వద్ద నాలుగు కిలోల గంజాయి లభ్యం

HNK: కాజీపేట మండల కేంద్రంలో గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తుల నుంచి నాలుగు కిలోల గంజాయి స్వాధీనం చేసుకొని నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాజీపేట పోలీసులు రైల్వే జంక్షన్ పరిసర ప్రాంతాల్లో నేడు తనిఖీలు చేపట్టగా ఒరిస్సా రాష్ట్రానికి చెందిన గోమంగు దిలీప్, సంజయ్ మండల్ అనే యువకుల వద్ద గంజి లభించినట్లు తెలిపారు.