అయ్యప్పస్వామికి అభిషేక పూజలు

అయ్యప్పస్వామికి అభిషేక పూజలు

MBNR: హరిహరపుత్ర అయ్యప్పస్వామి మహా పడిపూజ కార్యక్రమం మాలధారణ స్వాముల ఆధ్వర్యంలో శనివారం దేవరకద్రలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారి మహా పడిపూజలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పాల్గొని అయ్యప్పస్వామి ప్రతిమకు అర్చనలు, పంచామృతభిషేక ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఎమ్మెల్యేకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.