మొగల్తూరులో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు

W.G: మొగల్తూరు గ్రామంలో పెద్ద రామాలయం వీధుల్లోని శ్రీదత్త జ్ఞానసాయి బాబా ఆలయంలో గురువారం ఆలయ నిర్వాహకులు శెట్టి మోహన్ రావు ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొగల్తూరు,రామన్నపాలెం,పసలదీవి, సేరేపాలెం,కొత్తపాలెం గ్రామాల నుండి భక్తులు వచ్చి బాబాకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. భక్తులు సహకారంతో ఆలయ ఆవరణలో అన్నసంతర్పణ నిర్వహించారు.