వాడపల్లి వెంకన్న అన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం
కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో అమలు చేస్తున్న నిత్య అన్నదానం ట్రస్ట్‌కు సోమవారం ఆలమూరు వాస్తవ్యులు రామచంద్ర మూర్తి, నాగమణి దంపతులు రూ.1,00,000 విరాళం అందజేశారు. ఈ విరాళాన్ని ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధరరావుకు అందజేశారు. అనంతరం దాత కుటుంబానికి డిప్యూటీ కమిషనర్ స్వామివారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు.