రాజకీయాలు శాశ్వతం కాదు: సైదాపూర్ ఎస్పై
KNR: రాజకీయాలు ఎప్పటికీ శాశ్వతం కాదని, ప్రజలు ఎలాంటి ఘర్షణలకు పోకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలని సైదాపూర్ ఎస్సై తిరుపతి సూచించారు. నిన్న వెన్నంపల్లిలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఆయన గ్రామస్థులకు అవగాహన కల్పించారు. గ్రామంలో కక్షలకు తావులేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అన్నారు.