రేపు వాసవి దేవాలయంలో కృత్తిక నక్షత్ర వేడుకలు

రేపు వాసవి దేవాలయంలో కృత్తిక నక్షత్ర వేడుకలు

SRD: పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో మంగళవారం కృత్తికా నక్షత్ర వేడుకలు నిర్వహిస్తున్నట్లు దేవాలయ కమిటీ చైర్మన్ తోపాజి అనంత కిషన్ సోమవారం తెలిపారు. ఉదయం 9 గంటలకు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, 10 గంటలకు కుంకుమార్చనలు, లలిత సహస్ర పారాయణం, 12 గంటలకు పల్లకి సేవా కార్యక్రమం జరుగుతుందని చెప్పారు.