అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కొత్తవలస హాల్ట్
VZM: కొత్తవలస రైల్వే స్టేషన్‌ను అమృత్ భారత్ పథకంలో చేర్చడంతో పలు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్ట్ కల్పించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కే.పవన్ కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రైలు నంబర్స్ 16597/98, 16223/24, 16107/08, 16523/24. ఈ రైళ్లు కొత్తవలస దువ్వాడ మీదుగా గమ్యస్థానాలకు చేరుతాయని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.